కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామ్​

కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామ్​

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్‌‌ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌‌ఐఆర్‌‌)- కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 (సీఏఎస్‌‌ఈ) నోటిఫికేషన్‌‌ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశ వ్యాప్తంగా సీఎస్‌‌ఐఆర్‌‌ పరిశోధన కేంద్రాలు/ కార్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ప్రాతిపదికన 444 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు భర్తీ కానున్నాయి. 

ఖాళీలు : మొత్తం 444 పోస్టుల్లో సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ అండ్‌‌ అకౌంట్స్/ స్టోర్స్ అండ్‌‌ పర్చేజ్) 76 ఖాళీలు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ అండ్‌‌ అకౌంట్స్/ స్టోర్స్ అండ్‌‌ పర్చేజ్): 368 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత : బ్యాచిలర్స్‌‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 33 సంవత్సరాలకు మించరాదు. 

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్షలు(స్టేజ్‌‌ 1, 2), ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు  www.csir.res.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.