మరో నేత ఫ్లెక్సీ కడితే ఎమ్మెల్యేకు ఇబ్బందేంటి..వేములవాడ బీఆర్ఎస్లో విభేదాలు

మరో నేత ఫ్లెక్సీ కడితే ఎమ్మెల్యేకు ఇబ్బందేంటి..వేములవాడ బీఆర్ఎస్లో విభేదాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు నెలకొన్నాయి. వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ వర్సెస్ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నట్లుగా మారింది.  ఒకరికొకరు నువ్వెంతా  అంటే  నువ్వెంతా అనే స్థాయికి చేరింది. ఈ విషయం ప్రస్తుతం వేములవాడ బీఆర్ఎస్ లో  హాట్ టాఫిక్ గా మారింది. 

కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్ వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. తమను ఎమ్మెల్యే పోలీసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. చలమెడ లక్ష్మి నరింహస్వామి స్వామి బర్త్ డేకి ఫ్లెక్సీలు కడితే ఎమ్మెల్యేకి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. 

కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్ హాట్ కామెంట్స్..

  • బీఆర్ఎస్ పార్టీలో మొదటి చురుకైన కార్యకర్తగా పని చేస్తున్నాను.
  • మరో నేతకు ఫ్లెక్సీ కడితే స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఎందుకు మా పై కక్ష్యపెంచుకున్నాడు.
  • చలమెడ లక్ష్మి నరింహస్వామి బర్త్ డేకి ఫ్లెక్సీలు కడితే ఎమ్మెల్యేకి ఇబ్బంది ఏంటి..?
  • పార్టీ నాయకులను ఎమ్మెల్యే పోలీసులతో బెదిరిస్తున్నారు.
  • మేము తప్పు చేస్తే అధిష్టానంకు చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేయించాలి.
  • పార్టీ కోసం విద్యార్థి దశ నుండి ఎంతో కష్టపడ్డాను.
  • ఫ్లెక్సీలు కడితే పట్టణ సీఐ ఎందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారు.
  • మా ఇంటికి ఎమ్మెల్యే పోలీసులను పంపించాడు.
  • కేసులకు భయపడే ప్రసక్తే లేదు.
  • పార్టీ కోసం కష్టపడితే ఎమ్మెల్యే మాపై కక్ష్య పెంచుకున్నాడు.
  • మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కడితే గతంలో ఎమ్మెల్యే ఆగ్రహించాడు.
  • పార్టీ కోసం కష్టపడే నాకే ఇలా జరిగితే.... మిగతా కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తారు.
  • పార్టీకి నష్టం చేస్తే చర్యలు తీసుకోండి.
  • ఈ సంఘటనను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తా...అంటూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ కామెంట్స్ చేశారు. 

 

ఎమ్మెల్యే స్పందన..

నిమ్మశెట్టి విజయ్ కామెంట్స్ పై ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు స్పందించారు. నిమ్మశెట్టి విజయ్ కామెంట్స్ ను ఖండించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమ ఫోటో లను, వీడియో లను వ్యక్తిగతంగా కించ పర్చినా.., ఉద్దేశ్యం పూర్వకంగా రాజకీయ ఇబ్బందులకు గురి చేసిన పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరం అయితే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.  అసభ్య, అసత్య ప్రచారాలు చేస్తే పార్టీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.