జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్ గ్రీవెన్స్ నిర్వహించారు. జగిత్యాల మండలం గుట్రాజపల్లికి చెందిన పయ్యావుల రమేశ్ దంపతులు పురుగు మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చారు. గ్రామంలోని తన భూమికి వెళ్లే దారి విషయంలో పక్క రైతులు పురుమల ఆంజనేయులు మరికొందరు మూడేళ్లుగా అడ్డుకుంటున్నారని, రెవెన్యూ అధికారులు సర్వే చేసినా తమ పొలానికి దారి ఉందని తేల్చినా అడ్డుకుంటున్నాడని వాపోయారు.
గ్రామంలోని కొందరు అతనికి సహకరిస్తున్నారని, తనను వేధిస్తూ, చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు. సిబ్బంది వారి వద్ద ఉన్న మందు డబ్బాలను లాక్కున్నారు. జగిత్యాల మోతే గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తమ ఊరిలోని పెద్ద చెరువులో మట్టిపోస్తూ చెరువును ఆక్రమిస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
