సీఎం క్యాంప్​ ఆఫీస్​ పేరుతో భారీ మోసం

సీఎం క్యాంప్​ ఆఫీస్​ పేరుతో భారీ మోసం

సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి అనే దంపతులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మెడికల్ సీట్ కు రూ.50 లక్షల నుండి కోటి వరకు.. ఇంజనీరింగ్ సీటుకు రూ.10 లక్షల నుండి 16 లక్షల వరకు ఈ దంపతులు వసూలు చేస్తున్నారు. గ్రోవెల్ ఎడ్యుకేషనల్ కెరియర్ సర్వీసెస్ పేరుతో కాచిగూడలో సంస్థలు ఏర్పాటు చేసి ఘరనా మోసాలకు పాల్పడుతున్నారు.  గత రెండున్నరేళ్లుగా వీరు మోసాలు చేస్తూ భారీగా డబ్బు దండుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే మోసపోయిన బాధితులు వీరి కోసం ఐదు నెలలుగా వెతుకుతున్నా నిందితులు చిక్కడం లేదు. దీంతో చేసేది లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఇప్పటివరకు శ్రీధర్ రెడ్డి,సంధ్యారెడ్డి లను పట్టుకోలేకపోయారు. నిందితులను పట్టుపడకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.