వరదనీటిలో చిక్కుకున్న భార్యభర్తలు.. కొన్ని గంటల శ్రమించి రక్షించిన రెస్క్యూ టీం

వరదనీటిలో చిక్కుకున్న భార్యభర్తలు.. కొన్ని గంటల శ్రమించి రక్షించిన రెస్క్యూ టీం

గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నదిని దాటుతుం డగా.. వరద ఉధృతిలో ఓ కారు కొట్టుకుపోయింది.. కారులో ఉన్న భార్యభర్తలు భయంలో కేకలు పెట్టారు.  వరదనీటిలో చిక్కుకున్న దంపతులు కారు పైకప్పుపై కూర్చొని హాహాకారాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాలోని ఇదార్ పరిధిలో వడియావిర్, భుటియా గ్రామాల మధ్య ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న కారు నది దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారులోకి వేగంగా నీరు చేరడంతో మునిగిపోకుండా ఉండేందుకు పైకప్పు ఎక్కారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంలో వారిని కాపాడేందుకు సాధ్యం కాలేదు.. కొన్ని గంటల పాటు భార్యభర్తలు వరద నీటిలో బిక్కుబిక్కు మంటూ గడిపారు. 

ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు సహాయం అందించేందుకు ప్రయత్నించారు. అయితే వరద తీవ్రత కారణంగా జంటను చేరుకోలేకపోయారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. 

ALSO READ | మగధ్​ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ కప్లింగ్‌ బ్రేక్‌.. రన్నింగ్​ లో రెండు ముక్కలైంది..

రంగంలోకి దిగిన స్థానిక అగ్నిమాపక దళం వరదనీటిలో చిక్కుకున్న జంటను కాపాండేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఇదార్, హిమ్మత్ నగర్ అగ్నిమాపక దళాలు, పోలీసులు , స్థానిక వాలంటీర్లతో జంటను చేరుకోగలిగారు. ఎంతో శ్రమించి జంటను సురక్షితంగా వరద నీటినుంచి బయటికి తీసుకురాగలిగారు.