
తమిళనాడులోని అన్నాడీఎంకే నేత కల్వకూరిచి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభు(34), అదే నియోజకవర్గానికి చెందిన సౌందర్య (19) లు అక్టోబర్ 5న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎమ్మెల్యే ప్రభు దళిత వర్గం కాగా..సౌందర్య బ్రాహ్మణ వర్గానికి చెందిన అమ్మాయి. దీంతో కూతురు దళిత వర్గానికి చెందిన ప్రభును పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి స్వామినాధన్ అక్టోబర్ 5న పెళ్లి జరిగే మండపంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో నిప్పంటించుకున్నాడు. తాజాగా వివాహంపై కేసు నమోదు కావడంతో మద్రాస్ హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సౌందర్య తండ్రి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్‌లో కిడ్నాప్ ఆరోపణలను మద్రాస్ హైకోర్ట్ తోసిపుచ్చింది. 19 ఏళ్ల మహిళ తన 35 ఏళ్ల ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ప్రభుతో కలిసి జీవించేందుకు అనుమతించింది. కేసును కొట్టివేస్తూ తీర్పిచ్చింది.