టిప్స్​ కోసం జమాదార్ కక్కుర్తి​.. క్యూఆర్​ కోడ్తో వసూళ్లు

టిప్స్​ కోసం జమాదార్ కక్కుర్తి​.. క్యూఆర్​ కోడ్తో వసూళ్లు

కోర్టులో జమాదార్గా పనిచేసే అతగాడు కక్కుర్తి పడ్డాడు. కోర్టుకు వచ్చిపోయే లాయర్ల నుంచి టిప్స్​ వసూలు చేసేందుకు నడుం బిగించాడు. ఇందుకోసం ఏకంగా నడుముకు పేటీఎం క్యూఆర్​ కోడ్​ బ్యాడ్జీని  కట్టుకున్నాడు. ఈ వ్యవహారంపై అలహాబాద్​ కోర్టు ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని సస్పెండ్​ చేస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు జారీచేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగం అధికారులకు నిర్దేశించారు. ఆ జమాదార్​ ను కోర్టులోని నజారత్​ సెక్షన్​ కు అటాచ్​ చేశారు.