
‘కోర్ట్’ మూవీ డైరెక్టర్ రామ్ జగదీశ్ (Ram Jagadeesh) ఓ ఇంటివాడయ్యారు. ఆదివారం (ఆగస్టు 17) రాత్రి అతని పెళ్లి వైజాగ్ లో ఘనంగా జరిగింది. కార్తీక అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి వివాహ బంధంలో అడుగుపెట్టాడు రామ్ జగదీశ్. ఈ పెళ్లి వేడుకకు కోర్ట్ మూవీ బృందం హాజరయ్యారు. యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యి సందడి చేశారు.
ఈ సందర్భంగా నటుడు శివాజీ రిసెప్షన్ ఫొటోలను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. "నా ప్రియమైన కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ గారికి వివాహ శుభాకాంక్షలు. జీవితాంతం మీరు ఆనందంగా కలిసి మెలసి ఉండాలని కోరుకుంటున్నానని" శివాజీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రామ్ జగదీశ్ పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Happy Married life to my Dear Court Director #RamJagadeesh🥳
— Sivaji (@ActorSivaji) August 18, 2025
Wishing you a lifetime of togetherness& happiness ! pic.twitter.com/N9f4IKFWwY
ఈ క్రమంలో సినీ అభిమానులతో పాటు సెలెబ్రెటీలు దర్శకుడు జగదీష్కు విషెష్ చెబుతున్నారు. రామ్ జగదీశ్ది పెద్దల కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. వధువు కార్తీక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని తెలుస్తోంది.
‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’:
రైటర్ కం డైరెక్టర్ రామ్ జగదీశ్.. తన ఫస్ట్ మూవీ ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’తో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నాడు. చిన్న బడ్జెట్తో, భారీ లాభాలు వచ్చేలా సినిమా తీసి తన సత్తా చాటుకున్నాడు. కేవలం రూ.10కోట్ల లోపు బడ్జెట్‍తోనే కోర్ట్ మూవీ రూపొందించి రూ.56కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లతో లాభాలు తెచ్చిపెట్టేలా చేశాడు. అంతేకాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకునేలా చేశాడు.
Also read:-SSMB29: మహేష్ ఫ్యాన్స్ ఇది విన్నారా.. మూడో షెడ్యూల్ షూటింగ్ ఎక్కడో చెప్పిన నిర్మాత!
ఈ మూవీలో లవ్ స్టోరీతో పాటు, పోక్సో కేసు, కోర్టులో వాదనల చుట్టూ ఆసక్తికరంగా కథనం నడిపించాడు దర్శకుడు రామ్ జగదీశ్. డబ్బు బలంతో గవర్నమెంట్ అధికారులను లొంగదీసుకోవడం, చట్టంలోని లొసుగులని వాడుకోవడం కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. కులం, పగ ప్రతీకారాల కోసం పోక్సో లాంటి చట్టాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనేది చూపించి శభాష్ అనిపించుకున్నారు. ఇకపోతే నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో రామ్ జగదీష్ తన రెండో సినిమా చేస్తున్నట్లు టాక్.