రుణం ఎగవేత కేసులో శిల్పాషెట్టి, ఆమె తల్లి, చెల్లిలకు కోర్టు నోటీసులు

రుణం ఎగవేత కేసులో శిల్పాషెట్టి, ఆమె తల్లి, చెల్లిలకు కోర్టు నోటీసులు

ముంబయి: బాలీవుడ్ నటి శిల్పాషెట్టి, సోదరి షమితాషెట్టి, తల్లి సునందా షెట్టిలకు ముంబయిలోని అందేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. రూ.21 లక్షల రుణం తిరిగి చెల్లించలేదని ఓ వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఈ ముగ్గురూ ఫిబ్రవరి 28న కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. వివరాలలోకి వెళ్తే.. శిల్పా తండ్రి సురేంద్ర షెట్టి 2015లో ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి రూ. 21 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దానిని జనవరి 2017లో తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే అక్టోబర్ 11, 2016న సురేంద్ర షెట్టి మరణించాడు. దీంతో ఆ వ్యాపారి సురేంద్ర షెట్టి భార్య సునందా షెట్టి, కూతుళ్లు శిల్పాషెట్టి, షమితాషెట్టిలను రుణం కోసం నిలదీశాడు. కానీ, వారు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు.

 

మరిన్ని వార్తల కోసం:

పూలు పూయించలేదని...  తోటమాలీలను జైళ్లో పెట్టిన కిమ్