
అయోధ్య భూవివాదం కేసు వాదిస్తున్న రాజీవ్ ధావన్ కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెన్నైకి చెందిన మాజీ ప్రొఫెసర్ శణ్ముగం అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారంటూ పిటిషన్ లో తెలిపారు. దీంతో పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం.. శణ్ముగంకు నోటీసులు జారీ చేసింది. నెక్ట్స్ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు.