
బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎదురు దెబ్బ తగిలింది. బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢీల్లీ కోర్టు ఆదేశమిచ్చింది. ఫెరా చట్టం ఉల్లంఘించిన కేసులో.. చీఫ్ మెట్రోపొలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులకు జులై10 వరకు గడువునిచ్చింది కోర్టు. ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. మాల్యాపై ఇప్పటికే నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది.