
కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్న టైమ్‌లో కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, చత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రాలకు హై లెవల్ మల్టీ డిసిప్లినరీ పబ్లిక్ హెల్త్ టీమ్‌లను కేంద్రం పంపించింది. ఈ రాష్ట్రాల్లో టెస్టింగ్, ట్రాకింగ్, కంటెయిన్‌మెంట్, సర్వెయిలెన్స్, కరోనా రూల్స్ అమలు, ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్య, అంబులెన్సులు, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఆ సెంట్రల్ టీమ్‌లు స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తాయని తెలిపింది.
న్యూఢిల్లీ:దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్న టైమ్‌లో 6 రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, చత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రాలకు హై లెవల్ మల్టీ డిసిప్లినరీ పబ్లిక్ హెల్త్ టీమ్‌లను కేంద్రం పంపించింది. ఈ టీమ్‌లు అక్కడి కరోనా పరిస్థితులు, కట్టడి చర్యలను స్టడీ చేసి రిపోర్టు అందిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో టెస్టింగ్, ట్రాకింగ్, కంటెయిన్‌మెంట్, సర్వెయిలెన్స్, కరోనా రూల్స్ అమలు, ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్య, అంబులెన్సులు, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఆ సెంట్రల్ టీమ్‌లు స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తాయని తెలిపింది. కరోనా మేనేజ్‌మెంట్‌ను అంచనా వేసేందుకు, వైరస్ కట్టడికి అవసరమైన సూచనలు చేసేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు ఎక్స్‌పర్ట్ బృందాలను రాష్ట్రాలకు పంపిస్తోందని హెల్త్ మినిస్ట్రీ వివరించింది.
మెల్లగా పెరుగుతున్నయ్
ఏప్రిల్, మే నెలల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. కొద్దిరోజులుగా రోజువారీ కేసులు 50 వేల కన్నా తక్కువే నమోదవుతున్నాయి. అయితే ఇటీవల 40 వేల దిగువకు పడిపోయిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 46 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే దాదాపు 13 వేల కేసులు బయటపడ్డాయి. ఈ రాష్ట్రంలో రోజువారీ మరణాలు కూడా వందకు పైనే ఉన్నాయి.
వాక్ ఇన్ వ్యాక్సినేషన్‌కు ప్రెగ్నెంట్లకు అనుమతి
గర్భిణులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని వారం కిందట ప్రకటించిన కేంద్రం.. తాజాగా శుక్రవారం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. టీకాలు తీసుకోవడం కోసం ప్రెగ్నెంట్లు కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని లేదా నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ మేరకు కొత్త రూల్స్, ప్రొసీజర్స్ గురించి అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కాగా, ఇంతకుముందు వరకు ప్రెగ్నెంట్లకు కరోనా టీకాల సేఫ్టీ, ఎఫికసీ విషయంలో సరైన డేటా అందుబాటులో లేనందున పాలిచ్చే తల్లులకు మాత్రమే టీకాలు ఇవ్వొచ్చని కేంద్రం తెలిపింది. అయితే ప్రెగ్నెంట్లకు కూడా కరోనా టీకాలు బాగానే పని చేస్తున్నాయని, వారికీ టీకాలు వేయాలని గతవారం కేంద్రం నిర్ణయించింది.