ఆ ఏరియాల్లో కరోనాతో జాగ్రత్త!

ఆ ఏరియాల్లో కరోనాతో జాగ్రత్త!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. మహమ్మారి నియంత్రణ కోసం రాత్రి పూట కర్ఫ్యూ వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు చేస్తున్నాయి. కేసుల ఉధృతి రీత్యా రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. దేశ రాజధానిలో మెట్రో, మాల్స్, మార్కెట్లు, మూవీ థియేటర్లు, ప్రార్థనా మందిరాలను కరోనా సూపర్ స్ప్రెడర్ ఏరియాలుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన నిఘాతో వ్యవహరించాల్సిందిగా ఇంటర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌‌‌‌లను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ప్రాతిపదికన ఈ ఏరియాల్లో కరోనా నియంత్రణపై క్యాంపెయిన్‌‌ను ముమ్మరం చేయాలని సూచించింది. ఢిల్లీలో మంగళవారం ఒక్క రోజే 1,101 కరోనా కేసులు నమోదవ్వడం గమనార్హం.