బ్లాక్ మార్కెట్ లో క‌రోనా ర్యాపిడ్ కిట్స్ ..అంత‌రాష్ట్ర ముఠాస‌భ్యుల అరెస్ట్

బ్లాక్ మార్కెట్ లో క‌రోనా ర్యాపిడ్ కిట్స్ ..అంత‌రాష్ట్ర ముఠాస‌భ్యుల అరెస్ట్

ఓల్డ్ సిటీలో బ్లాక్ మార్కెట్ దందా నిర్వ‌హిస్తున్న అంత‌రాష్ట్ర ముఠా స‌భ్యుల్ని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కరోనా వైర‌స్ తో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొంద‌రు వ్యాపార‌స్థులు బ్లాక్ మార్కెట్ దందా నిర్వ‌హిస్తున్నారు.
నిందితుడు వెంకట సుబ్ర‌హ్మ‌ణ్యం తో పాటు మ‌రికొంత‌మంది క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల‌కు ఉప‌యోగించే 10వేల విలువ‌గ‌ల‌ మెడిసిన్ ను బ్లాక్ మార్కెట్ లో 40వేల నుంచి 50వేల వ‌ర‌కు అమ్ముతున్నారు. అమ్మ‌కాల్ని బ‌ట్టి ఒక్కొక్క‌రికి రూ.15వేలు క‌మీష‌న్ చొప్పున పెద్ద ఎత్తున నిందితుడు సుబ్ర‌హ్మ‌ణ్యం..ఓల్డ్ సిటీలో దందా న‌డిపిస్తున్నాడు. బ్లాక్ మార్కెట్ దందాపై స‌మాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో 35.5ల‌క్ష‌ల మెడిసిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి హెటిరో కంపెనీలో త‌యారు చేస్తున్న ఈ మెడిసిన్ ను.. మార్కెట్ లో షార్టేజీ ఉందంటూ ప్ర‌జ‌ల్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సేల్స్ రిప్ర‌జంటేటర్ల ద్వారా భారీ ఎత్తున అమ్మ‌కాలు జరుపుతున్నారు.
అంతేకాదు క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎమ‌ర్జెన్సీ అయితే డాక్ట‌ర్లు స‌జెస్ట్ చేస్తున్న మెడిసిన్ ను బ్లాక్ మార్కెట్ లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా పోలీసులు జ‌రిపిన దాడుల్లో ఈ ముఠా నుంచి  ఈ ముఠా నుండి కోవిఫీర్, 51 ఇంజక్షన్లు, అస్తి మ్రా 9 ఇంజక్షన్లు, అక్తిమ్రా 4 ఇంజక్షన్లు, ఫిబి ఫ్లూ 180 ఎంజి క‌రోనా ర్యాపిడ్ కిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.