Covid 19 : పెరుగుతున్న యాక్టివ్ కేసులు.. ఒక్క రోజులో తొమ్మిది మంది మృతి

Covid 19 : పెరుగుతున్న యాక్టివ్ కేసులు.. ఒక్క రోజులో తొమ్మిది మంది మృతి

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదౌతున్నాయి. కొన్ని చోట్ల మరణాలు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా.. రోజుకు 3వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన తాజా సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64 , 740 మంది కరోనా టెస్టులు చేసుకోగా అందులో 3,038 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో కరోనా బారిన పడ్డ వాళ్ల సంఖ్య 4,47,29,284 కి చేరింది. ఇందులో ప్రస్తుతం 21,179 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 

గడిచిన 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. దీంతో కరోనా వల్ల చనిపోయిన వాళ్ల సంఖ్య 5,30,901కి చేరింది. కోవిడ్-19 రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.1 శాతంగా ఉందని, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.