కరోనా ఎఫెక్ట్.. 67 శాతం మందికి ఉపాధి గల్లంతు

కరోనా ఎఫెక్ట్.. 67 శాతం మందికి ఉపాధి గల్లంతు

బెంగళూరుకరోనా వైరస్, లాక్​డౌన్​ కారణంగా దేశ జనాభాలో మూడింట రెండొంతుల(67 శాతం) మంది ఉపాధి కోల్పోతారని అజీమ్​ ప్రేమ్​జీ యూనివర్సిటీ సర్వే వెల్లడించింది. దీని ప్రభావం ఎక్కువగా అర్బన్​ ఇండియాపైనే ఉంటుందని పేర్కొంది. ఈ సంక్షోభ సమయంలో ఎక్కువగా ప్రభావితమయ్యే వారికి మరికొన్ని రిలీఫ్​ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పీడీఎస్​ ద్వారా అందజేస్తున్న సరుకులను మరో 6 నెలలు పొడిగించాలని, క్యాష్​ ట్రాన్స్​ఫర్​ స్కీమ్​ కింద నెలకు రూ.7 వేల చొప్పున 2 నెలలు ఇవ్వాలని సూచించింది. పది సివిల్​ సొసైటీ ఆర్గనైజేషన్లతో కలసి అజీమ్​ ప్రేమ్​జీ యూనివర్సిటీ ఈ సర్వే చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర(పూణె), ఒడిశా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్​లో దాదాపు 4 వేల మంది వర్కర్ల నుంచి ఫోన్​ ద్వారా అభిప్రాయాలు సేకరించింది. లాక్​డౌన్​ వల్ల ఉపాధి, జీవనాధారం, గవర్నమెంట్​ రిలీఫ్ స్కీమ్​ల అందుబాటు తదితర అంశాలపై ఈ సర్వే చేసింది.

పాలసీల్లో మార్పులు అవసరం

ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాలసీల్లో మరిన్ని మార్పులు చేయాలని, మీడియం, లాంగ్​ టర్మ్​ ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు ఉండాలని, దీని ద్వారా ఎకానమీని మళ్లీ గాడిలో పెట్టొచ్చని ఈ సర్వే టీమ్​సూచించింది. ఇందుకుగానూ తమ సర్వేలో గుర్తించిన విషయాలు ఉపయోగపడతాయని పేర్కొం ది.  ఎకానమీ రికవర్​ కావడానికి చాలా సమయం పడుతుందని పేర్కొంది. ప్రభుత్వాల రిలీజ్​ చర్యలు కింది స్థాయిలో అవసరాలకు సరిపోవడం లేదని తెలిపింది. పెద్దఎత్తున నగదు బదిలీలతో ఎకానమీలో డిమాండ్​ను తిరిగి తీసుకురావొచ్చని సూచించింది.

పడిపోయిన ఆదాయం

అర్బన్​ ఏరియాల్లో 80 శాతం, రూరల్​ ఏరియాల్లో 57 శాతం ఉపాధి కోల్పోతారని సర్వే స్పష్టం చేసింది. సెల్ఫ్ ఎంప్లాయ్​డ్​ వర్కర్ల ప్రస్తుతం పని చేస్తున్న వారి సగటు వారం సంపాదన రూ.2,240 నుంచి రూ.218(రూ.90 శాతం)కి పడిపోయింది. సాధారణ కార్మికుల్లో సగటు వారం సంపాదన ఫిబ్రవరిలో రూ.940 ఉంటే లాక్​ డౌన్ టైమ్​లో రూ.495కి పడిపోయింది. మొత్తం శాలరీ వర్కర్లలో 51 శాతం మంది తక్కువ శాలరీ లేదా అసలు శాలరీనే తీసుకోలేదు. 49 శాతం కుటుంబాల దగ్గర నిత్యావసరాల కొనుగోలు కు కూడా డబ్బుల్లేవని ఈ సర్వే తెలిపింది.

మహారాష్ట్ర జైలు నుంచి సగం మంది విడుదల?