తెలంగాణలో మరో 6 ఆస్పత్రులపై నిషేధం

తెలంగాణలో మరో 6 ఆస్పత్రులపై నిషేధం

హైదరాబాద్: కరోనా చికిత్స విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు తీసుకుంటోంది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా ఫిర్యాదు తీవ్రతను బట్టి వెంటనే తనిఖీలు చేయడమే కాదు చర్యలు తీసుకోవడంలో కూడా వేగం పెంచారు అధికారులు. తాజాగా హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయిన మరో ఆరు ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిషేధం వేటు వేసింది. 
1.కిమ్స్ (సికింద్రాబాద్)
2.సన్ షైన్ (గచ్చిబౌలి, హైదరాబాద్)
3.లోటస్ (లక్డీకాపూల్,హైదరాబాద్)
4.మెడిసిస్ (ఎల్బీనగర్, హైదరాబాద్)
5.ఇంటెగ్రో (టోలిచౌకి, హైదరాబాద్)
6.సెంచరీ (బంజారాహిల్స్, హైదరాబాద్).
ఈ ఆరు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సను వెంటనే నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అంటే కొత్త కరోనా రోగులెవరినీ చేర్చుకోకుండా నిషేధం అమలులోకి వస్తుంది. అయితే ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న రోగులందరికీ ప్రొటోకాల్ ప్రకారం చికిత్స కొనసాగిచాలని స్పష్టం చేశారు .ఎట్టకేలకు అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపధ్యంలో కరోనా చికిత్స పేరుతో దందాలు నిర్వహిస్తూ.. రోగులను అడ్డగోలుగా నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేటు,కార్పొరేట్ ఆస్పత్రులపై బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు.