
న్యూఢిల్లీ: చిన్నారులపై స్వదేశీ టీకా కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఢిల్లీ ,పాట్నా ఎయిమ్స్ తోపాటు, నాగ్‌పూర్ కేంద్రాల్లో పరీక్షలు జరుపుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని భావిస్తున్న తరుణంలో మళ్లీ అక్టోబర్, నవంబర్ లో థర్డ్ వేవ్ మొదలవుతుందన్న హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. సెప్టెంబర్ తర్వాతనే కరోనా థర్డ్ వేవ్ మొదలయ్ అవకాశం ఉందని, ఈసారి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందన్న హెచ్చరికల నేపధ్యంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది.
పిల్లల్లో కరోనా వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుందని శాస్త్రీయంగా తెలుసుకుని నిర్ధారించుకునేందుకు క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది.
12 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు టీకాను అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. తల్లిదండ్రుల అనుమతితో, వైద్యుల పర్యవేక్షణతో పిల్లలపై కరోనా టీకా కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 12 నుంచి18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ఢిల్లీ, పాట్నా, నాగపూర్ కేంద్రాల్లో ఈ ట్రయల్స్ చేపట్టారు.
రివర్స్ ఆర్డర్‌లో ఎంపిక చేసిన చిన్నారులను మొదటి టీకా డోస్ ఇవ్వనున్నారు. 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు, అనంతరం 2-6 సంవత్సరాల పిల్లలకు పరీక్షలకు నిర్వహించనున్నారు. మాస్ వేవ్ మొదలైతే పిల్లలను ఎలా కాపాడుకోవాలని, వారికి ఏ చికిత్స పనిచేస్తుందనేది శాస్త్రీయంగా నిర్ధారించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్చరికలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు చర్యగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.