కరోనా ఇప్పుడప్పడే అంతమవ్వదు: డబ్లూహెచ్ఓ

కరోనా ఇప్పుడప్పడే అంతమవ్వదు: డబ్లూహెచ్ఓ

కరోనా వైరస్ ఇప్పుడప్పుడే అంతమవ్వదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్లూహెచ్) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం గెబ్రేయేసస్ అన్నారు. మహమ్మారిని అంతం చేయడానికి టీకాలు మాత్రమే సరిపోవన్నారు. అయితే వ్యాక్సిన్ లు చాలా శక్తిమంతమైనవని, ప్రభావవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. ఏ తప్పులు చేయకుండా కరోనా పై పోరాటాన్ని కొనసాగించాలని
కోరారు. గత ఆరు వారాలుగా మహమ్మారి విజృంభిస్తోందని, ముఖ్యంగా నాలుగు వారాల నుంచి కరోనా మరణాలు ఎక్కువయ్యయన్నారు. ప్రపంచం మునుపటిలా ఉండాలని, ఆర్థిక వ్యవస్థ తెరుచుకొని బలపడాలని అందరికీ ఉందని.. కానీ చాలా దేశాల్లో ప్రజలు ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా కాలం పాటు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దీనిపై తాము పూర్తి అవగాహనలు రాలేదన్నారు.