పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 796 నమోదు

పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 796 నమోదు

దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,026కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కేసులు నమోదయ్యాయి. 109 రోజుల్లో 5వేలకు పైగా యాక్టివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అయితే, కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 98.80 శాతం రికవరీ రేటు ఉందని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరి మరణాలు నమోదయ్యాయి. ఈ ఐదు మరణాలతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,30,795కు చేరింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కరోనా బారిన పడ్డవాళ్ల సంఖ్య 4.46 కోట్లకు చేరింది. అయితే, పెరుగుతున్న కేసులను చూసి భయ పడాల్సిన పని లేదని, కాకపోతే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.