మ‌న ‌దేశంలో కంటే ఇత‌ర దేశాల్లో కరోనా మ‌ర‌ణాలు ఎక్కువ

మ‌న ‌దేశంలో కంటే ఇత‌ర దేశాల్లో కరోనా మ‌ర‌ణాలు ఎక్కువ

ఇత‌ర దేశాల‌తో పోలిస్తే మ‌న‌దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

మ‌న‌దేశంలో మిలియన్ జనాభాలో 2792 క‌రోనా కేసులు కాగా ప్రపంచ సగటు మూడు వేల 359 కేసులు న‌మోదువుతున్న‌ట్లు భూష‌ణ్ తెలిపారు. ఇక మ‌న‌దేశ‌ మిలియన్ జనాభాలో మరణం 49 కాగా, ప్రపంచ సగటు జ‌నాభాలో 111 మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్న‌ట్లు చెప్పారు.

దేశంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోదువుతున్న రాష్ట్రాల్లో 62 శాతం కేసుల‌తో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు. దేశంలో మొత్తం 70 క‌రోనా మ‌ర‌ణాలు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మ‌హ‌రాష్ట్రలున్నాయి

ఇక దేశంలో కోలుకున్న క‌రోనాకేసుల సంఖ్య 29 లక్షల 70 వేలకు పైగా ఉంది. ఇది క్రియాశీల కేసుల కంటే 3.6 రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపారు.

గత 24 గంటల్లో 11 లక్షల 72 వేల నమూనాలను పరీక్షించడం ద్వారా అత్యధిక సంఖ్యలో కోవిడ్ పరీక్షలు నిర్వహించే మైలురాయి దాటింద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్ల‌డించారు