దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు

దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు

దేశంలో వరుసగా ఐదు రోజులుగా మూడు లక్షలకు పైగా వస్తున్న కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ సంఖ్య నిన్న వచ్చిన 3.06 లక్షల కేసులతో పోలిస్తే 16.39 శాతం తక్కువ. అంటే గడిచిన 24 గంటల్లో 50,190 కేసులు తగ్గాయి. నిన్నటి వరకు 20 శాతం పైగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు కూడా భారీగా దిగొచ్చింది. నిన్న 20.7 శాతంగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు.. తాజాగా 15.5 శాతానికి తగ్గింది. వీక్లీ పాజిటివిటీ రేటు మాత్రం 17.17 శాతంగా ఉంది. అయితే ఈ ఒక్క రోజులో 614 మంది కరోనా కారణంగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 2,67,753 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల లోడ్ 22,36,842గా ఉందని పేర్కొంది. మొత్తంగా రికవరీ రేటు 93.15 శాతానికి పెరిగిందని వివరించింది.

మరిన్ని వార్తల కోసం..

యూపీ ఎలక్షన్స్: రామ మందిరం ఫొటోలతో స్పెషల్ చీరలు

అపార్ట్​మెంట్లు, గేటెడ్​ కమ్యూనిటీలే.. హాట్ స్పాట్లు!

తీవ్రత, డెత్ రేటు తక్కువున్నా.. ఒమిక్రాన్ ప్రమాదకరమే