ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. రెండు కొత్త వేరియంట్లు గుర్తింపు..

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. రెండు కొత్త వేరియంట్లు గుర్తింపు..

ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పదుల కొద్దీ కేసులు పెరగటంతో పాటు నలుగురు మరణించారు. ఇదిలా ఉండగా.. NB.1.8.1, LF.7 అనే రెండు కొత్త వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు. మే నెలలో రెండు వేరియంట్లు వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు ఆధికారులు. ఇవి వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ పెద్ద ప్రమాదకరం కాదని.. వైరస్ లక్షణాలు కనిపించినవారు సకాలంలో పరీక్షలు చేయించుకొని హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

ALSO READ | కరోనాతో 21 ఏళ్ళ యువకుడు మృతి.. థానేలో విజృంభిస్తున్న వైరస్..

LF.7, NB.1.8 సబ్‌వేరియంట్‌లను అండర్ మానిటరింగ్ వేరియంట్లుగా పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే, ఈ వేరియంట్‌లు చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉండగా... దేశంలోనే అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 38, మహారాష్ట్రలో 47 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇవాళ ( మే 25 ) కర్ణాటక, మహారాష్ట్రలలో కరోనా కేసులో మృతి చెందడం కలకలం రేపింది. బెంగళూరులోని ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల వృద్ధుడు శరీరంలోని అవయవాలు ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు అధికారులు. శనివారం రిపోర్టు రావడంతో చికిత్స మొదలు పెట్టారు. కానీ .. ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో చనిపోయాడు. 

కర్ణాటక ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. కర్ణాటకలో 38 కేసులు నమోదవ్వగా... అందులో బెంగళూరులోనే 32 పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.