హైస్కూళ్లో ఆరుగురికి కరోనా నిర్ధారణ.. ఆందోళనలో పేరెంట్స్

హైస్కూళ్లో ఆరుగురికి కరోనా నిర్ధారణ.. ఆందోళనలో పేరెంట్స్

భయపడుతూనే తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు తల్లిదండ్రులు. కరోనా సోకకుండా స్కూళ్లను సానిటేషన్ చేయడంతో పాటు పలు జాగ్రత్తలను విద్యాశాఖ తీసుకున్నా...విద్యార్ధులతో పాటు టీచర్లు కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనంగర్ జిల్లాలోని కొన్ని స్కూళ్లలోని విద్యార్ధులకు కరోనా సోకింది. లేటెస్టుగా ఇవాళ( మంగళవారం) సప్తగిరి కాలనీ హైస్కూళ్లో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఓ టీచర్, ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. నిన్న(సోమవారం) ఓ టీచర్ కు కరోనా రావడంతో ఇవాళ మొత్తం స్టాఫ్ కు, విద్యార్థులకు వైద్యు పరీక్షలు నిర్వహించిన అధికారులు... తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్కూల్ మూసియనున్నట్లు తెలిపారు.

మరోవైపు మంచిర్యాల జిల్లాలోని గర్ల్స్ హైస్కూల్ లో ఇవా(మంగళవారం) 29 మంది  స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న(సోమవారం) 14 మందికి పాజిటివ్ రాగా.. 11 మంది టీచర్లు, 2 వంట మనుషులు ఒక విద్యార్థినికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 43 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.

10వ తరగతికి చెందిన 20 మందికి ,9వ తరగతికి చెందిన 8 మందికి, 8వ తరగతిలో ఒక విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చింది . పాజిటివ్ స్టూడెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కు టెస్టులు చేస్తామన్నారు అధికారులు.