50 లక్షలు దాటిన కరోనా మరణాలు

50 లక్షలు దాటిన కరోనా మరణాలు

న్యూఢిల్లీ: ప్రపంచంలో కరోనాతో చనిపోయినోళ్ల సంఖ్య 50 లక్షలు దాటింది. డెల్టా వేరియంట్​ వ్యాప్తి ఎక్కువగా ఉండడం, చాలా దేశాలకు వ్యాక్సిన్​ అందకపోవడం, అమెరికా వంటి దేశా ల్లో వ్యాక్సిన్​ ఉన్నా అపోహలతో దాని వైపు వెళ్లకపోవడం వంటివి మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే, మునుపటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు కాస్తంత తగ్గాయని నిపుణులు చెప్తున్నారు. మొత్తం మరణాల్లో అమెరికా, రష్యా, బ్రెజిల్​, మెక్సికో, ఇండియాల్లోనే సగం నమోదయ్యాయి. తొలి 25 లక్షల మరణాలకు ఏడాదికిపైగా టైం పడితే.. రెండో 25 లక్షలు దాటడానికి కేవలం 8 నెలలే పట్టింది. అమెరికాలో అత్యధికంగా 7 లక్షల మంది మరణించారు. ప్రస్తుతం ప్రపంచంలో సగటున రోజుకు 8 వేల మంది కరోనాకు బలైపోతున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్​ కార్యక్రమం కొంచెం వేగం పుంజుకోవడంతో మరణాలు తగ్గుతున్నాయి. 

సగం ప్రపంచానికి వ్యాక్సిన్​ అందలె

పెద్ద దేశాల్లో వ్యాక్సిన్లున్నా జనాలు అపోహలతో వెనకడుగేస్తుంటే.. పేద దేశాల్లో మాత్రం జనాలు అడుగుతున్నా వ్యాక్సిన్లు అందే పరిస్థితిలేదు. ఇప్పటికీ సగం ప్రపంచానికి వ్యాక్సిన్లే అందలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేద దేశాలన్నీ కలిపితే కేవలం 2.3% మందికే ఇప్పటికి ఒక్క డోసు వ్యాక్సిన్​ అందింది. మొత్తంగా ప్రపంచంలోని 45.5% మందికి 630 కోట్ల డోసుల టీకా వేశారు. రోజూ సగటున 2.74 కోట్ల డోసుల వ్యాక్సిన్​ను జనానికి ఇస్తున్నారు. వ్యాక్సిన్​ పంపిణీలో తేడాలుండడాన్ని డబ్ల్యూహెచ్​వో సీరియస్​గా తీసుకుంది. అందరికీ వ్యాక్సిన్లు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కొవ్యాక్స్​ గ్రూప్​ ద్వారా పేద దేశాలకు టీకాలను ఎక్కువ మొత్తంలో అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటిదాకా అన్ని దేశాలకు సమానంగా టీకాలు పంపిణీచేస్తూ వచ్చిన కొవ్యాక్స్​.. ఇకపై టీకాలు అందని పేద దేశాలకే ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయమేదో ముందే తీసుకుంటే బాగుండేదని, వ్యాక్సినేషన్​ మొదలైన 15 నెలలకు తీసుకోవడమేంటన్న విమర్శలూ వస్తున్నాయి. 

దేశంలో 4.48 లక్షల మంది మృతి

మన దేశంలో కరోనాతో ఇప్పటిదాకా 4,48,339 మంది మరణించారు. శుక్రవారం 277 మంది చనిపోయారు. మరో 26,727 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 37 లక్షల 66 వేల 707కు పెరిగింది. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 13 శాతం పెరిగాయి. 2,75,224 మంది ఇంకా కరోనాకు ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.82 శాతం. ఇప్పటిదాకా 3 కోట్ల 30 లక్షల 43 వేల 144 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది.

దేశంలో 4.48 లక్షల మంది మృతి

మన దేశంలో కరోనాతో ఇప్పటిదాకా 4,48,339 మంది మరణించారు. శుక్రవారం 277 మంది చనిపోయారు. మరో 26,727 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 37 లక్షల 66 వేల 707కు పెరిగింది. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 13 శాతం పెరిగాయి. 2,75,224 మంది ఇంకా కరోనాకు ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.82 శాతం. ఇప్పటిదాకా 3 కోట్ల 30 లక్షల 43 వేల 144 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.86 
శాతంగా ఉంది.