
మనదేశంలో గడిచిన 24గంటల్లో 75,760 కేసులు నమోదు కాగా 1023 మరణించారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 33లక్షలు దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,310,234 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 60,472 నమోదైంది. రికవరీల సంఖ్య 2,523,771 కు పెరిగింది. మరణాల రేటు 1.83 శాతానికి తగ్గింది.