ఢిల్లీలో 15 రోజుల్లో 500 శాతం పెరిగిన కరోనా వ్యాప్తి

ఢిల్లీలో 15 రోజుల్లో 500 శాతం పెరిగిన కరోనా వ్యాప్తి

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వ్యాప్తి భారీగా పెరుగుతోందని తాజా సర్వేలో తెలింది. ఢిల్లీ, నేషనల్‌ క్యాపిటల్‌ రిజీయన్‌ (ఎన్సీఆర్‌‌)లో 15 రోజుల్లో వైరస్​ వ్యాప్తి ఏకంగా 500% పెరిగిందని లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. గత 15 రోజుల్లో తమకు తెలిసిన, దగ్గరి బంధువుల్లో (చిన్నారులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, పక్కింటి వారు, కొలిగ్స్‌) ఎవరైనా కొవిడ్‌ బారిన పడ్డారా? అనే విషయంపై సర్వే నిర్వహించారు. ఢిల్లీ, ఎన్సీఆర్‌‌లలో మొత్తం 11,743 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని, ఇందులో 67% మంది పురుషులు, 33% మంది మహిళలు ఉన్నారని లోకల్‌ సర్కిల్స్‌ చెప్పింది. గత 15 రోజుల్లో తమకు తెలిసిన వాళ్లల్లో ఎవరూ కరోనా బారిన పడలేదని 70 శాతం చెప్పారు. 11% మంది ఒక్కరు, ఇద్దరికి వైరస్‌ సోకిందని చెప్పారు. తమ వాళ్లల్లో 35 మంది వైరస్ బారిన పడ్డారని 8% మంది చెప్పారు. మరో 11% మంది ఎలాంటి సమాధానం చెప్పలేపోయారు. కాగా, ఢిల్లీలో శనివారం 461 కరోనా కేసులు నమోదయ్యాయని, వైరస్‌తో మరో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 5.33% ఉందని 
అధికారులు వెల్లడించారు.