
కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చే ఏడాది జులై వరకు ఎదురు చూడాలని డబ్ల్యూహెచ్ ఓ ప్రతినిధి తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మార్గరెట్ మాట్లాడుతూ..కరోనా వ్యాక్సిన్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అందుకే 3వ దశ హ్యూమన్ ట్రయల్స్ లో టీకా ఎంత వరకు సురక్షితమో చూడాలన్నారు. ట్రయల్స్ నుండి వచ్చిన డేటాను బహిర్గతం చేయాలని మార్గరెట్ చెప్పారు. చాలా మందికి టీకాలు వేశారు. కానీ టీకా పని చేస్తుందో లేదో మనకు తెలియదు. ఈ దశలో వ్యాక్సిన్ మనుగడ, పనితీరుపై స్పష్టమైన సంకేతాలు వెలువడలేదని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మార్గరెట్ మీడియా సమావేశంలో వెల్లడించారు.