12 దేశాలకు మన ‘కొవిన్’

12 దేశాలకు మన ‘కొవిన్’

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ​డ్రైవ్​ వివరాలు అప్​డేట్​ చేస్తున్న కొవిన్ ​టెక్నాలజీపై 12 దేశాలు ఇంట్రస్ట్​ చూపిస్తున్నాయి. మన దగ్గర సక్సెస్​అయిన ఈ టెక్నాలజీని తాము వాడుకుంటామని ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. బయట అమ్మొద్దనే కండీషన్​తో కొవిన్  టెక్నాలజీని ఆయా దేశాలకు కేంద్రం ఫ్రీగా అందించనుంది. టెక్నాలజీ ట్రాన్స్​ఫర్ కు సంబంధించి ఆయా దేశాలతో ఎక్స్​టర్నల్​ అఫైర్స్​మినిస్ట్రీ మాట్లాడుతోందని, 12  దేశాలు ఎంవోయూ కుదుర్చుకున్నాయని నేషనల్​ హెల్త్​ అథారిటీ  సీఈవో ఆర్​ఎస్ ​శర్మ చెప్పారు. యావరేజ్​గా సెకనుకు 100 వ్యాక్సినేషన్లను కొవిన్​ హాండిల్ ​చేయగలదన్నారు. ‘సెప్టెంబర్​17న ఇండియాలో 2.5 కోట్ల టీకాలను వేశారు. కొవిన్ ​సెకనుకు 800 వ్యాక్సినేషన్లను హాండిల్ ​చేసింది. అంటే గంటకు 30 లక్షలకు పైనే’ అని వివరించారు. రోజూ కోటికిపైగా డోసులను పంపిణీ చేసినప్పుడు కొవిన్​ సెకనుకు 400 వ్యాక్సినేషన్లను హాండిల్​ చేసిందని  తెలిపారు.