మంచి అలవాట్లను ఎంచుకోవాలి : సీపీ సాయి చైతన్య

మంచి అలవాట్లను ఎంచుకోవాలి : సీపీ సాయి చైతన్య

ఆర్మూర్, వెలుగు : మన బాధ్యతలు మనమే గుర్తించాలని, మంచి స్నేహితులను, మంచి అలవాట్లను ఎంచుకోవాలని,  సీపీ సాయి చైతన్య అన్నారు.  పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్ ఉమ్మడి మండల స్థాయి బాల, బాలికల వాలీబాల్, కబడ్డీ టోర్నీని జడ్పీ బాయ్స్​ హైస్కూల్​ గ్రౌండ్ లో నిర్వహించారు. మూడు రోజుల పాటు జరగనున్న టోర్నీని సీపీ సాయి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 

అనంతరం సీపీ మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదని, నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా భావించాలన్నారు. సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు.  కార్యక్రమంలో క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్​హెచ్ వో సత్యనారాయణగౌడ్​, ఎంఈవో పింజరాజగంగారాం, హెడ్మాస్టర్​ లక్ష్మీనారాయణ, మల్లేశ్​గౌడ్​ పాల్గొన్నారు.