గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలి

గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలి
  • గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలి
  • సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
  • పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
  • శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
  • పాత నేరస్తులు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి
  • టెక్నాలజీ ఉపయోగించి నిందితులను పట్టుకోవాలి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బాలానగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లలో కేసులు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటెన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ వంటి ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా గస్తీ, పెట్రోలింగ్ పెంచాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలన్నారు. 

Image

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటించాలని తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో విధులను నిర్వర్తించాలన్నారు. స్టేషన్ లోని సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారాన్ని సేకరించి, టెక్నాలజీని ఉపయోగించి నేరస్తులను పట్టుకుని, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. 

 

Image

Image

మరిన్ని వార్తల కోసం..

నారాయణను చిత్తూరుకు తరలించిన పోలీసులు

ఎన్ఎస్యూఐ నాయకులకు బెయిల్