సిద్దిపేట రూరల్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి విద్యార్థి నడుం కట్టాలని సీపీ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని వివిధ స్కూల్స్ తో పాటు, ఆన్‌లైన్‌ద్వారా డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలి అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలను అభినందించి బహుమతులు అందజేశారు.
సీపీ మాట్లాడుతూ డ్రగ్స్ సమాజాన్ని నాశనం చేస్తుందని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ పాల్గొన్నారు.
