
కరీంనగర్ జిల్లా కమ్యూనిస్టులకు ఒకప్పుడు గట్టి పట్టున్న జిల్లా. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఫస్ట్ MPబద్ధం ఎల్లారెడ్డితో పాటు.. అనేక మంది ప్రజాప్రతినిధులు కమ్యూనిస్టు పార్టీల నుంచి గెలిచారు. కానీ ఇప్పుడు ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుంటే తప్ప.. మనుగడ సాధించలేని సిచ్యువేషన్ కొచ్చారు కామ్రేడ్లు. 2004లో కాంగ్రెస్, TRS, సీపీఐ కూటమిగా పోటిచేసింది. ఆ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి CPIనేత చాడ వెంకట్ రెడ్డి గెలిచారు. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది CPI. హుస్నాబాద్ నుంచి పోటీచేసిన చాడ ఓడిపోయారు. అప్పటి నుంచి సీపీఐకి హుస్నాబాద్ ఓటర్లు చాన్స్ ఇవ్వలేదు.
వచ్చే ఎన్నికల్లో BRS, వామపక్షాలు కలిసే పోటీ చేసేలా ఉన్నాయి. గత అనుభవాలు చాడ వెంకట్ రెడ్డితో పాటు, కమ్యూనిస్టు నేతలకు తలనొప్పిగా మారాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు హుస్నాబాద్ సీటు అడగాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్టు టాక్. పట్టుబట్టి సీటు తీసుకుంటే రిజల్ట్ అటీటైతే ఎంటన్న ప్రశ్న కూడా కామ్రేడ్లను పరేషాన్ చేస్తోందట. గెలిస్తే ఓకే..లేదంటే కమ్యూనిస్టుల ఉనికికే ప్రమాదమని కామ్రేడ్లు భయపడుతున్నారట.
హుస్నాబాద్ పై బెట్టుచేసినా సీటు దక్కే చాన్స్ లేదట. కెప్టెన్ లక్ష్మీకాంతరావు కొడుకు సతీష్..హుస్నాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే. మొదటి నుంచి CM KCRకు వొడితెల ఫ్యామిలీ చాలా దగ్గర. వరంగల్ ఎప్పుడెళ్లినా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లోనే KCR ఉంటారు. ఉద్యమం నుంచే కెప్టెన్ ఫ్యామిలీతో కేసీఆర్ కు అటాచ్ మెంట్ ఎక్కువ. ఇన్నీ ఈక్వేషన్ల మధ్య హుస్నాబాద్ సీటు అవసరమా అనే డిస్కషన్ కమ్యూనిస్టుల్లో మొదలైందంట. అసెంబ్లీకి బదులు మండలి అడిగితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారట. చాడ వెంకట్ రెడ్డి మనసులోని మాట కూడా ఇదేనని పార్టీలో చర్చ జరుగుతోందంట.
మండలికైతే..ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీగా అధికార పార్టీ నామినేట్ చేస్తే సరిపోతుంది. ఎమ్మెల్యేగా గెలవాలంటే చాలా తిప్పలు పడాలే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ తలనొప్పికంటే MLC అడిగితేనే బెటరనే కాన్సెప్ట్ కు ఫిక్స్ అయ్యారట కమ్యూనిస్టులు. పొత్తు కుదిరితే ఇదే ప్రతిపాదనను..కేసీఆర్ ముందు పెట్టడం ఖాయమంటున్నారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది చాడ వెంకట్ రెడ్డినేనని కామ్రేడ్లు అంటున్నారు.