కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించడంలో సీఎం కేసీఆర్ వైఫల్యం: చాడ

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించడంలో  సీఎం కేసీఆర్ వైఫల్యం: చాడ

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విమర్లులు గుప్పించారు.  తెలంగాణ ప్రభుత్వం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించడంలో వైఫల్యం చెందిందన్నారు.  పరీక్షా విధానంలో చట్టబద్దమైన విధానాలు పాటించకపోవడం వలనే గ్రూప్ వన్ పరీక్ష రద్దయిందన్నారు.  దీనికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్  ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. సంక్షేమ పథకాలను కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారు.  కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల తీరును ఖండిస్తున్నామన్నారు.  అధికారుల సమక్షంలో గ్రామసభలు ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపికచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి  డిమాండ్ చేశారు.