ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు : చాడ వెంకట్ రెడ్డి

ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు : చాడ వెంకట్ రెడ్డి
  • సీపీఐ జాతీయ నేత  చాడ వెంకట్ రెడ్డి

హుజూరాబాద్, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం బూటకపు ఎన్‌‌‌‌కౌంటర్లు చేస్తోందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్‌‌‌‌రెడ్డి అన్నారు.  సీపీఐకి వందేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ప్రచార జాత హుజూరాబాద్‌‌‌‌కు చేరుకుంది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్చలకు సిద్ధమని మావోయిస్టులు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ఎర్ర జెండాల్లో చీలికలు వచ్చేలా పాలకులు కుట్రలు చేస్తున్నారని, అందరూ ఏకమై ప్రజా ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చాడ పేర్కొన్నారు.