- సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
కోరుట్ల, వెలుగు: ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ప్రదర్శన ర్యాలీ చేశారు. అనంతరం సీపీఐ ఆఫీస్ముందు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 1925లో పుట్టిన సీపీఐ భారత గడ్డపై 100 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు.
ఈ నెల18న సీపీఐ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ ఖమ్మంలో జరగనుందని, ఆ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్మిక సంఘం నేత, సీపీఐ సీనియర్నేత సి.ప్రభాకర్ స్తూపం వద్ద ఆయన ఫొటోకు నివాళులర్పించారు. ప్రభాకర్ ఆశయ సాధనకు కార్మికులు, రైతులు, కమ్యూనిస్టు శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, రాష్ట్ర నాయకుడు తాళ్లపల్లి లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాములు, ముక్రం, మౌలానా, శాంత, రాధా, హనుమంతు పాల్గొన్నారు.
