- సీపీఐ నేత నెల్లికంటి సత్యం
దేవరకొండ, వెలుగు: దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ మరింత బలపడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. గురువారం దేవరకొండలో జరిగిన సీపీఐ నియోజకవర్గ సమితి సమావేశంలో ఆయన జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు.
బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం సీపీఐ రాజీలేని పోరాటాలు నిర్వహించిందని, ఆ త్యాగాలతో పార్టీ భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ వందేళ్ల ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, జిల్లా నేతలు పల్లా నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
