సీఎంకు సీపీఐ నేత వెంకట్ రెడ్డి లేఖ

సీఎంకు సీపీఐ నేత వెంకట్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: సిటీలోని బాబుఘాట్ భూమిని భూ అక్రమార్కులకు చెందకుండా కాపాడాలని సీపీఐ నేత వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. టూరిజం శాఖ పరిధిలోని లంగర్ హౌజ్ వద్ద సర్వేనెంబర్‌‌ 5/2, 15/2,13/2లో  ఒక ఎకరం 8 గుంటల భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ఈ భూమిని.. దేవుని గుడి పేరుతో కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. వారిపై టూరిజం అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆ భూమికి ఫెన్సింగ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తే, కొందరు అడ్డుకుంటున్నారని వివరించారు. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.