ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ముట్టడించిన సీపీఐ

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ముట్టడించిన సీపీఐ

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు :  ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు ప్రదర్శన నిర్వహించారు. కార్పొరేషన్ లోపలకు వెళ్లేందుకు -ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కార్యాలయం ముందు -బైఠాయించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్​ మాట్లాడుతూ సంక్షేమ పథకాల -అమలులో రాజకీయ వివక్ష తగదన్నారు.  

సంపద పెంచి పేదలకు పంచుతామని చెబుతున్న ప్రభుత్వం ముందుగా సంక్షేమ పథకాలను పేదలందరికీ వర్తింపజేయాలని డిమాండ్​ చేశారు. పట్టణంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలన్నారు. విలీన గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కారించాలని పలు మార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో మున్సిపల్​ కార్యాలయాన్ని ముట్టడించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎస్​కే జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.