సంపదను  సంపన్నులకే  కాదు పేదలకు కూడా పంచాలి..

సంపదను  సంపన్నులకే  కాదు పేదలకు కూడా పంచాలి..

గౌరవెల్లి భూ నిర్వాసితులపై జరిగిన దాడిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. భూ నిర్వసితులపై పోలీసు యంత్రాంగం ఆకారణంగా చితకబాదారని ఆయన మంపడ్డారు. మంగళవారం సీపీఐ మీడియాతో మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎకరానికి 10 లక్షలు ఇచ్చి ప్రాజెక్టు కోసం భూమిని స్వీకరించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి భూ నిర్వాసితులను నుండి భూమిని అన్యాయంగా లాకుంటున్నారని నారాయణ అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎం అత్తగారి గ్రామాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాడని నారాయణ ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు, మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం వాటిని ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని డబల్ బెడ్ ఇండ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. కానీ కట్టకుండా ప్రజలను మోసం చేశాడు ఆరోపించారు.

భూ నిర్వాసితుల ఇళ్లల్లోకి చొరబడి వారి ఇళ్లను, గుడిసెలను కాల్చి వేస్తున్నారని.. గుడిసెలు దగ్ధం చేసే  హక్కు మీకు ఎవరు ఇచ్చారని నారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను  సంపన్నులకే  కాదు, పేదల కూడా కాస్త పంచాలి. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పోలీస్ డిపార్ట్మెంట్ వత్తాసు పలుకుతోందని ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్ముకుంటే  కేసీఆర్ ఒంటరి అయిపోతాడు. కేసీఆర్ ప్రజలను నమ్ముకోవాలి అని నారాయణ హెచ్చరించారు. నాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేరడం లేదు.. నేడు దానికి విరుద్ధంగా టిఆర్ఎస్ సర్కారు పాలన సాగుతోందని నారాయణ విమర్శించారు.