పనికిరాని బిగ్​బాస్ ​షో ఎందుకు?

V6 Velugu Posted on Sep 12, 2021

  • ఇలాంటి ప్రోగ్రాంలు ఎందుకని సీపీఐ నారాయణ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి గానీ, ప్రజలకు గానీ ఏమైనా ఉపయోగం ఉందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ‘ఈ షో ఏ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది? ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయి? ఇలాంటి బూతుల ప్రపంచం వందల కోట్ల వ్యాపారానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. ప్రోగ్రాంలో వాళ్ల కొట్లాటలు అనైతికంగా ఉన్నయ్’ అని నారాయణ శనివారం వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ షోపై తాను కోర్టులో పిల్ దాఖలు చేశానని, న్యాయ వ్యవస్థ కూడా తనకు సాయం చేయట్లేదన్నారు. బిగ్ బాస్ ప్రోగ్రాంకు పర్మిషన్ ఇవ్వడం మంచిదికాదన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అరికట్టాలని సూచించారు.

Tagged CPI Narayana, Big boss, cpi, Big boss telugu, BigBoss 5, Big Boss show

Latest Videos

Subscribe Now

More News