
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) గెలిచిన విషయం తెలిసిందే. సామాన్య రైతు కుటంబం నుండి వచ్చి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవడం మామూలు విషయం కాదు. తాను అనుకున్నదాని కోసం కష్టపడి, ఆటలు అద్భుతంగా ఆది లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఫైనల్ గా బిగ్ బాస్ టైటిల్ కూడా గెలుచుకొని తనలాంటి వాళ్లకి ఆదర్శనంగా నిలిచాడంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తాజాగా బిగ్ బాస్ షోపై, ఈ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ. ఆయన ఈ షో గురించి మాట్లాడుతూ.. సజ్జనార్ ఆర్టీసీ బస్సులు పగలకొట్టారని కేసులు పడతామని అన్నారు. నిజానికి బిగ్‌బాస్ షో అనేదే అరాచకం అని నేను ముందే చెప్పాను. సజ్జనార్ సైబర్ కమిషనర్ గా ఉన్నప్పుడు.. బిగ్‌బాస్ షో అనేది క్రైమ్ దానిపై యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇస్తే.. నేను చేయలేను అన్నారు. కోర్టుకి వెళ్తే.. పై కోర్టుకి వెళ్ళండి అన్నారు. బిగ్‌బాస్ షోపై చర్యలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్, కోర్టులు సైతం భయపడ్డాయి.కేవలం డబ్బు కోసమే ఇలాంటి షోలు చేస్తున్నారు.
ఇక గత సీజన్స్ కు సారైనా రేటింగ్ రాకపోవడంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలని అట్రాక్ట్ చేయడానికి రైతుబిడ్డని తెరపైకి తీసుకొచ్చారు. అందుకే అతనికి ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. బిగ్ బాస్ షో అంతా నాటకం. ఇప్పటికైనా ఈ షోను బ్యాన్ చేయాలని కోరుతున్నాను.. అంటూ సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణా. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.