పిరికిపందలు రాజకీయాల్లో ఉండొద్దు: సీపీఐ నారాయణ

పిరికిపందలు రాజకీయాల్లో ఉండొద్దు: సీపీఐ నారాయణ
  • – స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టకండి
  • – ప్రధాని మోదీ ప్రజలను ఎందుకు కలుస్తలేరు
  • – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


ఢిల్లీ: కేంద్ర బీజేపీ సర్కార్​ అడ్మినిస్ట్రేషన్ ను ఉపయోగించుకొని ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. లిక్కర్ స్కాం కేసులో అసలు నిందితులను వదిలి కేజ్రీవాల్ టీంను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రాముడు, కృష్ణున్ని అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్​అయ్యారు. ప్రజలకు మేలు చేసి ఉంటే ఇన్ని జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం వచ్చేదికాదన్నారు. ఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ ‘మోదీ సర్కార్ ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడి విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. 17 ఏ కత్తి పెట్టి చంద్రబాబును లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది.

జగన్ ఎప్పుడో కేంద్రానికి లొంగిపోయాడు. రూ.45 వేల కోట్లు దోచి..11 కేసుల్లో నిందుతుడిగా ఉన్న ఆయనపై చర్యలు లేవు. పిరికిపందలు రాజకీయాల్లో ఉండటం సరికాదు, స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టొద్దు. జగన్ తన తండ్రి పేరు చెడగొట్టేందుకే పుట్టాడు. కాంగ్రెస్ సీపీఐ, సీపీఎం కలిసి బీజేపీ, చంద్రబాబు, జగన్ లకు వ్యతిరేకంగా పోరాడుతం. దేవుళ్లను కలిసే మోదీ సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు?  విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే ప్రధాని.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడో బీజేపీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్​చేశారు.