గ్రేటర్వరంగల్/ తొర్రూరు, వెలుగు: అమరుల ఆశయ సాధన కోసం నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వారోత్సవాలను ప్రారంభించారు. వరంగల్సమీపంలోని బొల్లికుంట సీపీఐ కాలనీ అంబేద్కర్‌నగర్‌లో సీపీఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్, మహబూబాబాద్జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో జిల్లా కార్యదర్శి కామ్రేడ్ విజయ సారథి ఆధ్వర్యంలో వారోత్సవాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పంజాల రమేశ్, జిల్లా సహాయ కార్యదర్శి బాష్ మియా, ఖిలా వరంగల్మండల కార్యదర్శి దండు లక్ష్మణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.