ఆర్మూర్, వెలుగు: నిరుపేదలకే డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని సీపీఐ ప్రజా పంథా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవరాం డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజాపాలన అంటే ఆదర్శ గ్రామంలో సర్వే చేసి అర్హుల లిస్టును తయారుచేసిన వాటిని తొలగించడమా అని ప్రశ్నించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అంకాపూర్ నిరుపేదలైన 52 మంది ప్రగతి భవన్ ముట్టడి చేసి డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి కారకులయ్యారన్నారు. నిర్మాణ దశలో, సర్వే తర్వాత పేదల లిస్టు తొలగించి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కేటాయించడం న్యాయమా అని ప్రశ్నించారు.
ఒకే కుటుంబంలో నలుగురికి ముగ్గురికి కేటాయించడం సరి కాదన్నారు. ఇప్పటికైనా అనర్హులను తొలగించి అర్హులకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల సంయుక్త కార్యదర్శి కిషన్, నిఖిల్, పోశెట్టి, భోజమ్మ, తదితరులు పాల్గొన్నారు.
