బెల్ట్​ షాపులపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ

బెల్ట్​ షాపులపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ

బోధన్, వెలుగు: గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నబెల్ట్​close షాప్​లపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు ఆర్డీవో ఆఫీస్​ముందు ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్​ఏవో విఠల్​కు వినతిపత్రం అందించారు. బోధన్ ​డివిజన్​సహాయ కార్యదర్శి బి.మల్లేశ్​ మాట్లడుతూ  అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో రేవంత్​రెడ్డి బెల్ట్​షాపులను మూయిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.

బోధన్​ డివిజన్​లోని బోధన్​టౌన్​, బోధన్​రూరల్, సాలూరా, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా మండలాల్లోని గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం లభిస్తోందన్నారు. చర్యలు తీసుకోకుంటే షాపులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. లీడర్లు పడాల శంకర్, జీ.సీతారాం, గంగయ్య, గణపతి,పోశెట్టి, శంకర్ పాల్గొన్నారు.