
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఎల్లుండి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. బీజేపీ మతోన్మాద శక్తులకు వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కావాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషాతో కలిసి శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ లో రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. హైదరాబాదులో మత కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ, మజ్లీస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. శంషాబాద్ లో ఈనెల 4వ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్టీ రాష్ట్ర మహాసభలను జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రారంభిస్తారని చాడ వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి 800 మంది ఈ మహాసభల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.