సీతారాం ఏచూరి ఆశయ సాధనకు పాటుపడాలి : మోకు కనకారెడ్డి

సీతారాం ఏచూరి ఆశయ సాధనకు పాటుపడాలి : మోకు కనకారెడ్డి

జనగామ, వెలుగు : సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి, కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయ సాధనకు పడాలని పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ పార్టీ ఆఫీసులో ఏచూరి ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ పార్టీలో అంచలంచెలుగా ఎదిగి జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టి దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేశారన్నారు.

 దేశ రాజకీయాల్లో ఐదు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన ఏచూరి అందరికీ అదర్శమన్నారు. ఏచూరి స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇర్రి అహల్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.