ఎన్నికల బాండ్లను బహిర్గతం చేయాలి : పర్వతాలు

ఎన్నికల బాండ్లను బహిర్గతం చేయాలి : పర్వతాలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎలక్ట్రోరల్  బాండ్లను బహిర్గతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్  చేశారు. సోమవారం నాగర్ కర్నూల్, తాడూర్​ బ్యాంక్  ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్  కంపెనీలతో కుమ్మక్కై ఎన్నికల బాండ్లను అడ్డగోలుగా తీసుకుందని ఆరోపించారు. ఇలా వేల కోట్ల రూపాయలు బీజేపీ ఖాతాలో జమ చేసుకొని, ఎన్నికల కోసం వాడుకుంటున్నారన్నారు. పార్లమెంట్  ఎన్నికలకు ముందు దేశ ప్రజలందరికీ బాండ్ల వివరాలు తెలియజేయాలని డిమాండ్  చేశారు. కందికొండ గీత, కాశన్న, అశోక్, రామయ్య, సత్యనారాయణ, శివరాం, రవి, కార్తీక్, చారి పాల్గొన్నారు.

వంగూర్: ఎన్నికల బాండ్ల కొనుగోలును వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలోని ఐవోబీ బ్యాంక్​ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆంజనేయులు మాట్లాడుతూ ఎస్బీఐ చైర్మన్  ఎన్నికల బండ్లను బహిర్గతం చేయకుండా నిర్లక్షం చేయడం సరైంది కాదన్నారు. శివరాములు, మల్లయ్య, వెంకటయ్య, బాలమ్మ పాల్గొన్నారు.