అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై సీపీఎం రివ్యూ

అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై సీపీఎం రివ్యూ
  • అహంభావంతోనే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటమి: తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్, వెలుగు: రాబోయే కాలంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామనీ, తమ పార్టీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి, మంత్రి వర్గానికి శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్​లోని ఎంబీభవన్​లో ఇటీవల జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు సంబంధించిన విషయాలను తమ్మినేని వీరభద్రం మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని, తమ ఎత్తుగడలు సంతృప్తికరంగానే ఉన్నాయని అన్నారు. పోటీచేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తక్కువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని వివరించారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీట్ల సర్దుబాటు నిర్ణయం లేటు కావడం, చివరి నిమిషంలో పొత్తు సాధ్యం కాదని తేలాక ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈసారి సీపీఎం కుటుంబాలే ఓటేశాయి తప్ప, సంప్రదాయంగా వేసే అభిమానులు పార్టీకి ఓటేయలేదని వివరించారు. పార్టీ కమిటీలు, శాఖలు, కార్యకర్తల్లో లోపాలు తలెత్తాయనీ, పార్టీ నుంచి దూరమైన ఘటనలు పలు జిల్లాల్లో ఏర్పడిందని తెలిపారు. ఈ లోపాలను సమీక్షించుకుని భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు ప్రదర్శించిన అహంభావం, అనుసరించిన అప్రజాస్వామిక ధోరణులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. మరోపక్క రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడో యాత్ర, రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నాయకత్వం, కర్నాటకలో విజయం వంటి పరిణామాలన్నీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపునకు తోడ్పడ్డాయని వివరించారు.